ఒడిశా నుంచి అక్రమ రవాణా చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు హయత్నగర్ పోలీసులు తెలిపారు. ఎక్సైజ్ అధికారులు, వినియోగదారులు గుర్తించకుండా తెలంగాణ ప్రభుత్వ ఎక్సైజ్ స్టిక్కర్లను బాటిళ్లకు అంటించి బెల్టుషాపులకు సరఫరా చేస్తున్నారు. కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఈ నకిలీ, అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ. 1 కోటి ఉంటుందని తెలిసింది. హయత్నగర్ రేడియో స్టేషన్ సమీపంలో ఓ రేకుల గదిలో డంపు చేసిన 300 కాటన్ల మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.