ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ కు మరో 12 చీతాలు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 17, 2022, 03:01 PM

చిరుతల సంరక్షణలో భారత్ మరో అడుగు ముందుకేసింది. ఈ సారి 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండగా.. వచ్చే ఏడాది జనవరి 10 నాటికి ఈ చీతాలు మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ చీతాల కోసం ఇప్పటికే క్వారంటైన్ ఎన్ క్లోజర్లు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ చీతాలు వస్తే భారత్ లో వీటి సంఖ్య 20కి చేరుతుంది. ఇటీవల నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలు ఆరోగ్యంగానే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com