ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాడులు జరుగుతున్నా కేంద్రం ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 17, 2022, 05:28 PM

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మాచర్ల ఘటన జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ఆరోపించారు. ఈ అంశంపై స్పందించిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇంత జరుగుతున్నా.. కేంద్రం ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదన్నారు. మాచర్ల ఘటన చూసిన తర్వాత అసలు ఏపీ లో.. ప్రజాస్వామ్యం బ్రతికుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి బలమైన నాయకత్వాన్ని వైసీపీ  జీర్ణించుకోలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందని విమర్శించారు. ముమ్మాటికే ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిన అరాచక ఘటనేనని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com