మాచర్లలో జరిగిన గొడవలు రాజకీయాల్లో సర్వసాధారణమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల్లో గొడవలు ఇదే మొదటిసారి కాదని... చివరిసారి కూడా కాదని తెలిపారు. 75 ఏళ్ల చంద్రబాబు బట్టలూడదీసి కొడతానని రోజూ అంటున్నారని మండిపడ్డారు. బహిరంగ సభల్లో చంద్రబాబు మాటలను మాచర్లలో ఆదర్శంగా తీసుకొని ఉంటారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు.