మాజీ మంత్రి పరిటాల సునీత ‘రైతుకోసం - తెలుగుదేశం’ పాదయాత్ర ను శనివారం చెన్నేకొత్తపల్లి మండలం, ముష్టికోవెలలో ప్రారంభమైంది. వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.