పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ, శ్రేణుల మధ్య ఘర్షణపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాజకీయాల్లో గొడవలు జరగడం ఇదే మొదటి లేదా చివరి సారి కాదని, ఇలాంటి ఘటనలు జరగడం సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. 75 ఏళ్లు పైబడిన చంద్రబాబు బట్టలూడదీసి కొడతానని బహిరంగంగానే అంటున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని మాచర్లలో కొందరు చంద్రబాబు అడుగుజాడల్లో నడిచి ఉంటారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు మాచర్ల ప్రజలను ప్రభావితం చేసి ఉంటాయని అన్నారు.