ఢిల్లీ ఎయిర్ పోర్టులో తాజాగా భారీ డ్రగ్స్ దందా బయటపడింది. గినియా దేశస్తురాలైన ఓ మహిళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా ఆమె 82 క్యాప్సూల్స్ మింగినట్లు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణలో క్యాప్సూల్స్ బయటకు తీసినట్లు తెలిపారు. మొత్తం 1,024 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని.. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ.15.36 కోట్లు ఉందని పేర్కొన్నారు. నిందితురాలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామన్నారు.