జనాభా మాదిరిగానే మధుమేహ రోగుల్లోనూ చైనా, భారత్ పోటీ పడుతున్నాయి. చైనా 141 మిలియన్ల మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 77 మిలియన్ల మధుమేహులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మన దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య 2045 నాటికి 135 మిలియన్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. దీని బారిన పడే వారిలో మహిళల కంటే పురుషులే అధికంగా ఉంటున్నారు. 2020లో దేశంలో 7 లక్షల మంది డయాబెటిస్ తో చనిపోయారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం కేరళ 19.8 శాతం మధుమేహ బాధితులతో అగ్రస్థానంలో ఉంది.