తమిళనాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు ఇతర సేవలకు ఇక ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేశారు. ఆధార్ నెంబర్ల ఆధారంగానే ఇక నుంచి లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని విద్యుత్ కనెక్షన్లకూ ఆదార్ లింక్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ కోటీ 9 లక్షల మంది తమ కనెక్షన్లకు ఆధార్ నెంబర్ అనుసంధానించారు. మరో కోటి మందికి పైగా ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కొత్త లబ్ధిదారుల ఎంపికలో సైతం ఈ నిబంధన వర్తించనుంది.