ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార మార్పులు అధిక రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయి. మన ఆహారంలో చేపలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్ లో ఉంచొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచేలా ఉప్పును తగ్గించుకోవాలని.. ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ప్రతిరోజూ ధ్యానం, యోగా ద్వారా మనసుకు ప్రశాంతత కలిగి రక్తపోటు సమస్య దరి చేరదని పేర్కొంటున్నారు.