అఫ్గాన్, మయన్మార్ పాలకులకు ఐక్యరాజ్యసమితిలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చి బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు, సైనిక పాలకుడు జుంటా ఐరాసలో తమ ప్రతినిధులకు స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేయగా అది తిరస్కరణకు గురైంది. ఆయా పాలకుల విజ్ఞప్తిని వాయిదా వేయాలన్న 193 సభ్య దేశాల అధికార కమిటీ సూచనలకు ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు చాబా కొరొసి ఆమోదం తెలిపారు. దీంతో ఆయా దేశాల్లో గత ప్రభుత్వాలు నియమించిన రాయబారులే ఐరాసలో ప్రతినిధులుగా కొనసాగనున్నారు.