మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను అంతమొందించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ నేర చరిత్ర ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇన్ చార్జిగా పెట్టి, చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డిలు మండిపడ్డారు. టీడీపీ హత్యా రాజకీయాలకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిల ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.