జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీలకు అమ్ముడుపోయే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. పింఛన్లు, బీమా సొమ్ముతో కమీషన్లు పొందే రకం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తామన్నారు. ప్రభుత్వ అకృత్యాల వల్లే తాను రోడ్లపై పోరాడుతున్నానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.ఎవరికో కొమ్ము కాస్తున్నామని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు.భవిష్యత్తులోనూ ప్రభుత్వ వ్యవస్థలను వైసీపీ ఉపయోగించుకుంటుందన్నారు. ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు.