నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో దేవాంగ సంఘ నేతలు ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేవాంగులు ఎదుర్కొంటున్న పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మన్యం సతీష్ , పముజుల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.