పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో యన్ ఆర్ ఐ మహిళ క్రిష్ణ ప్రియా, విజేత వారి అధ్వర్యంలో నియోజకవర్గం మహిళా నేతల తో వారు ముఖాముఖి కార్యక్రమంను సోమవారము నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ మహిళలు ఏవిదంగా సమస్యలను ఎదుర్కొవాలి, ఓటర్లు ను ఎలా ప్రభావితం చేయాలి అనే అంశము పై క్లుప్తంగా అవగాహన కల్పించారు. మహిళలు నడుం బిగించాలని, రాన్నున రోజుల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసీ, మన పిల్లల భవిష్యత్తు కు పూలబాట వేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నేతలందరూ పాల్గొన్నారు.