రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 21న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ, రాష్ట్రం వెలుపల అనేక ప్రాంతాల్లో భారీగా రక్తదాన శిబిరాలు నిర్వహి స్తున్నట్లు రెడ్‌క్రాస్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఆరుమళ్ల శ్రీధర్‌రెడ్డి తెలిపారు. రెడ్‌క్రాస్ రక్తకేంద్రంలో ఆదివారం రక్తదాన ఏర్పాట్లపై వలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... సీఎం జన్మదినం రోజున నూతన రక్త్తదాతల నమోదును కూడా చేపట్టాలన్నారు. ప్రతి నూతన జిల్లాలో ఆధునిక వసతులతో రెడ్‌క్రాస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రక్తసేకరణ, యువతను రెడ్‌క్రాస్ ఉద్యమంలో భాగ స్వా మ్యం కల్పించటంలో, ఇతర సేవా కార్యక్రమాల్లోనూ కావలి రెడ్‌క్రాస్ శాఖ రాష్ట్రంలోని అన్ని ఉపశాఖల కంటే ప్రథమ స్థానంలో ఉందన్నారు. కావలిలో త్వరలో తలస్సీమియా సెంటర్, హోమ్ నర్శింగ్ తదితర సేవా పథకాలను ప్రారంబిస్తున్నామని చెప్పారు.