వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని కర్నూల్ జిల్లా, తెలుగుదేశం పార్టీ కల్లూరు మండల అధ్యక్షుడు డి.రామాంజనేయులు అన్నారు. కల్లూరు మండలం పెద్దకొట్టా లలో మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత ఆదేశాల మేరకు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో తిరిగి వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగితెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ ప్రజా వ్యవతిరేక విధానాలను ప్రజలకు వివరించి సమస్యలపై టీడీపీ టోల్‌ఫ్రీ నెంబరుకు మిస్డ్‌కాల్ ఇవ్వాలని సూచించారు. అనంతరం రామాంజనేయులు మాట్లాడుతూ.... వైసీపీ పాలనలో ఇసుక, మైన్, వైన్, భూకబ్జా మాఫియా రాజ్యం ఏలుతుందని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రజలు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. టీడీపీని ప్రజలు ఆదరించి చంద్రబాబును సీఎంగా గెలిపించుకుంటేనే రాష్ట్రం అన్నిరకాల అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎం.రంగారెడ్డి, ఖాసీంవలి, దాదాఖాలింధర్, మాబు, మదార్‌సాహెబ్, జివిద్, దుబ్బన్న, ఇస్మాయిల్, నయూం, మాబాషా, రజాక్ తదితరులు పాల్గొన్నారు.