ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ వారంలో జరగాల్సిన కొత్త ప్రభుత్వ తొలి అసెంబ్లీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం తెలిపింది. న్యూఢిల్లీలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలినందున డిసెంబర్ 21 నుండి 24 వరకు జరగాల్సిన ముఖ్యమంత్రి అన్ని కార్యక్రమాలు వాయిదా వేసినట్లు చెప్పారు. డిసెంబర్ 21న ధర్మశాలలో నిర్వహించాల్సిన 'ఆభర్ ర్యాలీ' కూడా వాయిదా పడింది. అలాగే ధర్మశాలలో డిసెంబర్ 22 నుంచి 24 వరకు జరగాల్సిన శీతాకాల సమావేశాలను కూడా వాయిదా వేసినట్లు తెలిపారు. ర్యాలీ, అసెంబ్లీ సమావేశాల తదుపరి తేదీలను త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు.