నోటిపూతతో చాలా మంది కూడా బాధ పడతారు. నోటి పూతకి తేనెను వాడటం మంచిది. పసుపు పొడి, వేడి నీటిని కూడా ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటితో కూడా నోటి బొబ్బలు చాలా ఈజీగా తొలగిపోతాయి. గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకుని బాగా పుక్కిలించాలి. ఇన్ఫెక్షన్లను నివారించడంలో పసుపు చాలా బాగా పని చేస్తుంది. మీరు పసుపు పొడిని వాడితే నోటి పూతల వాపు నుంచి ఉపశమనం పొందుతారు. ఒక గిన్నెలో కొంత పసుపు పొడిని తీసుకుని కొంచెం నీరు కలపాలి. ఇలా ఒక మందపాటి పేస్ట్‌గా సిద్ధం చేసుకుని.. రోజుకు రెండుసార్లు మీకు వచ్చిన నోటి బొబ్బలపై రాయాలి.