బెల్లంలో శరీరాన్ని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి. ఇది సహజంగా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. చలికాలంలో ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. ఇది గొప్ప ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది, ఆర్థరైటిస్ వంటి ఎముకల వ్యాధులను నయం చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి బెల్లం నీరు మంచి ఔషధం.