వైయస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పవన్ తాను ఏం చేస్తానో కూడా చెప్పలేకపోతున్నారని, చంద్రబాబు ఏజెంట్గా పని చేస్తున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...... వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో 50 లక్షల మంది సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నారు. కోటి మందికి పైగా డ్రాక్వా మహిళలకు రూ.26 వేల కోట్లు వైయస్ఆర్ ఆసరా ద్వారా లబ్ధి పొందారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు 40 లక్షల మందికి వైయస్ఆర్ చేయూత ఇస్తున్నారు. 30 లక్షల మంది మహిళలకు అమ్మ ఒడి ఇస్తున్నారు. మూడున్నరేళ్లలో 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారు. వీరంతా వైయస్ జగన్ ఇచ్చేది మాకొద్దు అంటే అప్పుడు ఆలోచన చేయాలి. వైయస్ జగన్ ఏ సభకు వెళ్లినా కూడా దేవుడి దయ, మీ చల్లని దీవెనలు కావాలని, మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిపక్ష నేత మాత్రం అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ను మళ్లీ అధికారంలోకి రానివ్వం, ఓట్లు చీలనీవ్వమని అంటున్నారు. వీరి మాటలు అర్థం చేసుకోండి అని ఆయన తెలియజేసారు.