ఐఐటీల్లో పరిశోధన సీట్ల ప్రవేశాలు, అధ్యాపక నియామకాల్లో రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఐఐటీ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించేలా ఆదేశించాలని ఎస్ఎన్ పాండే అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో పారదర్శక విధానం పాటించడం లేదని, అనర్హులు నియమితులవుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ తో కూడిన ధర్మాసనం.. రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.