కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొన్నాళ్లుగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. కశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది. అయితే, రాహుల్ పాదయాత్రపై బీజేపీ నేతలు విమర్శిస్తుండగా.. ఆయన సెటైరికల్ రిప్లై ఇచ్చారు. విధ్వేష రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓ మార్కెట్ గా, తన పాదయాత్రను ఆ విధ్వేష మార్కెట్ లో ప్రేమను నింపే ఓ దుకాణంగా పోల్చి సమాధానమిచ్చారు.