ప్రియుడిని దారుణంగా హతమార్చిందో ప్రియురాలు. శవాన్ని డ్రమ్ములో కుక్కి.. అడవిలోకి తీసుకువెళ్లి కాల్చేసింది. చత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్ గావ్‌లో జరిగిందీ ఘోరం. వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడితో డబ్బు విషయంలో గొడవలు రావడంతో ప్రియురాలు ఈ ఘాతుకానికి పాల్పడింది. హత్య విషయాన్ని కప్పి పెట్టడానికి మృతదేహాన్ని ఓ డ్రమ్ములో కుక్కింది. అడవిలోకి తీసుకు వెళ్ళింది. అక్కడ మృతదేహాన్ని తగలపెట్టింది. అనంతరం ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేసింది. అయితే, మూడు రోజుల క్రితం చంద్ర భూషణ్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు రాగిణి సాహును పోలీసులు అరెస్ట్ చేశారు.