ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. మరో మహిళతో చనువుగా ఉంటున్నాడని ఓ వివాహిత తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. ఈ ఘటన ఈ నెల 17న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజోలు మండలం తాటిపాకకు చెందిన ఓ వివాహితకు గూడపల్లికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నెల 17న రాత్రి వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. సన్నిహితంగా ఉన్న సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. మరో మహిళతో చనువుగా ఉంటున్నాడన్న కోపంతో ఆ వివాహిత బ్లేడుతో తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. బాధితుడు వెంటనే అక్కడి నుంచి రాజోలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అనంతరం అతడిని మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సర్జరీ చేయడంతో అతడు కోలుకుంటున్నాడని బంధువులు తెలిపారు. పోలీసులు అతడిపై దాడి చేసిన వివాహితపై కేసు నమోదు చేశారు.