పొలిటికల్ పార్టీపై ఈ నెల 25న అన్నీ చెబుతానని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు. తుమకూరు నగరంలోని సిద్ధగంగా మఠాన్ని ఆయన కుటుంబంతో కలిసి సందర్శించారు. గత 14 ఏళ్ల నుంచి మఠాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపారు. తనకు మానసికంగా, దైహికంగా శక్తిని ఇచ్చేది మఠాలేనని చెప్పారు. ఈ మఠంలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడనని, ఈ నెల 25న బెంగుళూరులో మీడియా సమావేశం నిర్వహించి అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.