నాలుగేళ్లుగా అనేక చర్చల అనంతరం చరిత్రాత్మక జీవ వైవిధ్య ఒప్పందానికి కెనడాలో జరుగుతున్న కాప్-15 సదస్సులో సుమారు 200 దేశాలు సోమవారం ఆమోదం తెలిపాయి. కాలుష్యం, వాతావరణ మార్పుల నుంచి భూమిని, సముద్రాలను, రకరకాల జీవుల్ని కాపాడడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం అన్ని వనరుల నుంచి 2030 నాటికి ఏటా కనీసం 20,000 కోట్ల డాలర్ల మేర నిధుల్ని సమీకరించనున్నారు. పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం సహా అంతరించిపోతున్న జీవ జాతులను రక్షించేలా ప్రధానంగా దృష్టి సారిస్తారు.