వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. సీఎం పుట్టినరోజును పురస్కరించుకొని 600 కేజీల కేక్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, వెల్లంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, కైలా అనిల్‌కుమార్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా పాల్గొన్నారు.