నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ), ఎక్సైజ్ శాఖపై సమీక్షలో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. నార్కొటిక్స్‌తో పాటు, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరి కట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం, యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడం.. ఈ నాలుగింటిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రాన్ని నార్కొటిక్స్ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దడంలో ఎక్సైజ్, ఎస్‌ఈబీ అధికారులతో పోలీస్ శాఖ మరింత సమన్వయంతో పని చేయాలి. అదే విధంగా దిశ యాప్ వినియోగం, కాల్స్, వేగంగా స్పందించడం వంటి వాటిపై అన్ని చోట్లా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు.