గుంటూరు నగరంలో ప్రియా గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో చోరీ జరిగింది. సోమవారం రాత్రి ఫంక్షన్ హాల్లో వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకట కృష్ణ అనే వ్యక్తి హాజరయ్యాడు. దొంగల భయంతో ఆయన ఇంట్లో ఉన్న బంగారు నగలు బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చారు. వధూవరులకు అక్షింతలు వేయడం కోసం బ్యాగ్‌ను కుర్చీలో పెట్టి వేదికపైకి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి బ్యాగ్ కనిపించలేదు. వెంకట కృష్ణ ఒక బ్యాగ్‌తో కల్యాణమండపానికి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బ్యాగులో సుమారు రూ. 25 లక్షలు విలువ చేసే బంగారు నగలు ఉన్నట్లు వెంకట కృష్ణ తెలిపారు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.