ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనాన్ని పెంపొందించడం సాధ్యమవుతుందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకుని మంగళవారం నగరంలోని లెక్చరర్స్ కాలనీలో నూతన పార్కును ప్రారంభించి మొక్కలు నాటారు. మేయర్ వసీం, మహాలక్ష్మి శ్రీనివాస్, వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, డేవిడ్, దామోదర్‌రెడ్డి, దీపా తదితరులు హాజరయ్యారు.