పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగానే ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7న ప్రారంభమైన పార్లమెంట్ వింటర్ సెషన్ ఈ నెల 29 వరకూ కొనసాగాల్సి ఉండగా.. 6 రోజుల ముందుగానే అంటే ఈ నెల 23తో ముగియనుంది. ఈ నెల 23న పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడనున్నాయి. లోక్ సభ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa