ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో ఓ బీజేపీ నేత రెచ్చిపోయాడు. కూలీ కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. రౌడీలను మోకరించి భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా కూలీ నివాసముంటున్న గుడిసెను జేసీబీతో కూల్చివేయించాడు. ఓ సమస్యపై నిరసన తెలిపినందుకు ఆగ్రహానికి గురైన బీజేపీ నేత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. బీజేపీ నాయకుడిని అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.