ప్రస్తుత రోజుల్లో శ్వాస సంబంధిత సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. ఈ సమస్య ఉన్నవారు ఎక్కువసేపు నడవడం లేదా పరుగెట్టడం లాంటివి చేయలేరు. ఈ సమస్య ఉంటే కొన్ని ఆహార పదార్ధాలు మాత్రం అస్సలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. శ్వాస సమస్యలు ఉన్నవారు చలవ చేసే పదార్ధాలకు దూరంగా ఉండాలి. లేకపోతే ఈ సమస్య ఎక్కువవుతుంది. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కానీ, శ్వాస సంబంధింత సమస్య ఉన్నవారు పాలు అస్సలు తీసుకోకూడదు. పాలు తాగడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. మద్యం అతిగా తాగడం వల్ల కూడా శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి.