ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతాయని హెచ్చరిస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకూ ఉదయం లేవగానే బ్రష్ చేసి సరిపడినంత ప్రోటీన్లతో కూడిన అల్పాహారం తినడం ఉత్తమమని చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచిన గంటలోపే అల్పాహారం తీసుకోవాలని పేర్కొంటున్నారు. అలాగే, ఉదయం నిద్ర లేవగానే బెడ్ పైనే కాఫీ, టీ తాగడం మానుకోవాలని, దానికి బదులు ప్రోటీన్లతో నిండిన విజిటబుల్ స్పూతీ, పండ్ల రసం వంటివి తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.