టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో కొంతమంది దుండగులు సైబర్ నేరాలకు పాల్పడిన ఘటన బీహార్ లోని పాట్నాలో జరిగింది. ఓ ముఠా.. ఆన్ లైన్ లో నకిలీ ఫైనాన్స్ కంపెనీని సృష్టించి తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తామని.. తమ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రజలను నమ్మించారు. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, జీఎస్టీ తదితర పేర్లతో డబ్బు ముందుగా వసూలు చేసి ఆ తర్వాత సిమ్ లు మార్చేసి మోసాలకు పాల్పడ్డారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తో పాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.