బీహార్ లోని టీచర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి కన్నవారికే వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బేతియాకు చెందిన అంజలికుమారి అనే 21 ఏళ్ల యువతి.. అదే ప్రాంతంలో ఓ కోచింగ్ సెంటర్ నిర్వహించే చందన్ కుమార్ అనే 27 ఏళ్ల టీచర్ ప్రేమించుకున్నారు. డిసెంబర్ 12న వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి యువతి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో అంజలికుమారి.. ‘నా భర్త, అతని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. వారికి ఏదైనా జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తా. హైకోర్టుకే కాదు సుప్రీంకోర్టుకు కూడా లాగుతా.’ అంటూ ఓ వీడియో విడుదల చేసింది.