ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో టెస్టుకు ఆ ఇద్దరు ఆటగాళ్లు దూరం

sports |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 02:22 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ బంగ్లాదేశ్ తో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యారని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ ఎడమ బొటన వేలికి గాయం అయిన విషయం తెలిసిందే. రోహిత్ గాయం పూర్తిగా నయం కావడానికి మరికొంత సమయం అవసరమని వైద్య బృందం అభిప్రాయపడిందని బీసీసీఐ తెలిపింది. ఉదర కండరాల ఒత్తిడి కారణంగా నవదీప్ సైనీ రెండో టెస్టుకు దూరమయ్యాడని, అతడు ఎన్సీఏ కి వెళ్తాడని తెలిపింది.


బంగ్లాదేశ్‌తో జరిగే 2వ టెస్టుకు భారత జట్టు ఇదే: కేఎల్ రాహుల్ (c), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా (vc), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (wk), కెఎస్ భరత్ (wk), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com