ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నందిగాం మండలం పెద్దతామరపల్లి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పేరాడ తిలక్ కొబ్బరి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కి అండగా నిలిచి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి స్థానిక సర్పంచ్ తమిరి దేవేందర్రావు, ఎంపీటీసీ సభ్యులు సైలాడ లావణ్య, పిఎసిఎస్ అధ్యక్షులు కురమాన బాలకృష్ణారావు, సర్లాన బైరాగి, ఎంపిడిఓ హెచ్ వి రమణమూర్తి, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు చిన్ని జోగారావు యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు తమరి ఫల్గుణరావు, వైస్ ఎంపీపీ ప్రతినిధి ఆర్ కుర్మారావ్, ఎంపీటీసీ సభ్యులు బార్నాన బాలకృష్ణ, అంబోడి విష్ణు సర్పంచులు మడపాల సంజీవరావు, కింతల శేషగిరి, తమిరి రాజు, జడ్యాడ జయరాం, బొమ్మాలి గున్నయ్య, పుష్య సత్యం, బొంగి హనుమంతరావు, సంభాన దానయ్య, బోలుభద్ర సోమేశ్వరరావు, టి. రామారావు, కరుకోల రామకృష్ణ, నాగ రామారావు, రట్టి నాగరాజు, జీరు లక్ష్మణ్ రెడ్డి, తమరి షణ్ముఖ రావు, తమిరి వివేకానంద, నందిగామ చిన్నబాబు పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.