నలుగురు కలిసి రాత్రంతా పార్టీ చేసుకున్నారు. తీరా.. తెల్లారేసరికి అందులో ఇద్దరు చనిపోయారు. ఆదివారం రాత్రి గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఫేజ్ 3లో నైట్ రైడర్ క్లబ్లో ఆ క్లబ్ ఓనర్ సంజీవ్ జోషి తన బర్త్ డే పార్టీని ముగ్గురు మహిళలతో కలిసి చేసుకున్నారు. క్లబ్‌లోని ఓ గదిలో రాత్రంతా గడిపారు. సోమవారం ఉదయం సంజీవ్ జోషితో పాటు ఒక మహిళ చనిపోయి కనిపించారు. మరో ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆ రూమ్‌లో వేడిమి కోసం కాచే నిప్పు ఉంది. అయితే, వెంటిలేషన్ తక్కువగా ఉండడం వల్ల ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.