ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ సంస్థ డుకాటీ సంస్థ కొనుగోలుదారులకు చేదు వార్త వినిపించింది. తమకు సంబంధించిన అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచే పెరిగిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో డుకాటీ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ముడిసరుకు, ఉత్పత్తి, రవాణా ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.