ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్ లు పంపిణీ చేయనుంది. సీఎం జగన్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన చేతుల మీదుగా ఈ ట్యాబ్ ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ట్యాబుల ద్వారా బైజూస్ పాఠ్యాంశాలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 4.60 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వనున్నారు. అంతేకాకుండా 8వ తరగతి నుంచి ఆ పై తరగతులకు చెప్పే టీచర్లకు కూడా ట్యాబ్ లను ఉచితంగా ఇవ్వనున్నారు. జూన్ నుంచి 15 వేల స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విద్యార్థులకు ఇచ్చే శామ్ సంగ్ ట్యాబ్ ఖరీదు రూ.15 వేలు. వీటికోసం ప్రభుత్వం రూ.700 ఖర్చు చేస్తోంది.