తనను మార్కెట్ కు వెళ్లొద్దన్నాడని ఓ మహిళ తన భర్తను ఇటుకతో కొట్టి హతమార్చిన ఘటన ఝార్ఖండ్ ఖుంటీలో జరిగింది. సోనాగఢ్ పుర్ లో అర్జున్ సింగ్, భార్య కళావతితో ఉంటున్నాడు. ఆమె మార్కెట్ కు వెళ్తానని అడగ్గా అర్జున్ వద్దన్నాడు. దీంతో వీరి మధ్య గొడవ జరగ్గా.. కోపంతో ఇటుకతో అర్జున్ తలపై దాడి చేసింది. అనంతరం భర్తను గదిలోకి మోసుకెళ్లి పడేసింది. స్థానికులు ఆపేందుకు యత్నించగా వారిపై కూడా దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలు కళావతిని అరెస్ట్ చేశారు.