మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్రహ్మణ్యంకు చెన్నైలోని వడపళని దండాయుధపాణి దేవాలయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన కుటుంబంతో కలిసి శనివారం సామాన్య భక్తుడిలా దర్శనానికి వెళ్లి.. 3 ప్రత్యేక దర్శన టికెట్ల కోసం రూ.150 ఇవ్వగా.. 2 రూ.50 టికెట్లు, ఒక రూ.5 టికెట్ ఇచ్చారు. దీనిపై ప్రశ్నించగా అనంతరం సిబ్బంది మార్చి ఇచ్చారు. ఫిర్యాదు చేసేందుకు ఈవో వద్దకు వెళ్లగా అందుబాటులో లేరు. ఈ క్రమంలో జడ్జితో అక్కడి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దీనిపై సుబ్రహ్మణ్యం ఈవోను కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించి వెళ్లిపోయారు. తర్వాత ఈవో కోర్టుకు హాజరు కాగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.