మంచి నిద్ర విశ్రాంతికే కాదు. శరీరం తిరిగి పుంజుకోవడానికి, లోపల మలినాలను శుభ్రం చేసుకోవడానికి సాయపడే ప్రక్రియ. ఈ క్రమంలో కొందరు నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది పడుతుంటారు. దీని పరిష్కారానికి కొన్ని నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. పడుకోవడానికి కనీసం అరగంట ముందు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండాలి. ఆలోచనలు మాని దీర్ఘ శ్వాస తీసుకుంటే కునుకు దరి చేరుతుందని చెబుతున్నారు. గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు జాజికాయ పొడి కలిపి సేవిస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుందని పేర్కొంటున్నారు. రోజూ ఒకే సమయానికి నిద్ర పోయేలా చూడాలంటున్నారు.