ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ నిందితుడు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. మొయిన్‌పురి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని వైద్య పరీక్షల నిమిత్తం నోయిడాలోని ఆసుపత్రికి సోమవారం తీసుకెళ్లారు. తనకు టాయిలెట్ వస్తుందని పోలీసులను నిందితుడు నమ్మించాడు. అనంతరం ఆసుపత్రి టాయిలెట్ కిటికీ నుంచి దూకి పరారయ్యాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నోయిడా) అశుతోష్ ద్వివేది తెలిపారు.