ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి తన ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సర్వీసెస్ వ్యాపారాలకు సంబంధించిన అనేక యూనిట్లలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది. దాదాపు 5,250 మందిని తీసివేయనుంది. అది కంపెనీ మొత్త మ్యాన్ పవర్ (35,314)లో 15శాతం. ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఉద్యోగంలో చేరినవారిపై కూడా ప్రభావం పడనుందని తెలుస్తోంది. కాస్ట్ కట్టింగ్, ఆర్థిక మాంద్య కారణంగా చూపుతూ ఇప్పటికే ఆమెజాన్, గూగుల్, జొమాటో వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి.