క్రీస్తు విలువలను ముందుకు తీసుకుపోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టర్ లోని స్పందన గ్రీవెన్స్ హాల్ లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబులపతి, క్రిస్టియన్ మైనారిటీ అధికారి మధుసూదన్ రెడ్డి, లు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ప్రభుత్వ పరంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీస్తు ఐక్యతకి, అనురాగానికి, సామాజిక పరిపక్వతకి నిదర్శనమన్నారు. దయ, కరుణ, దాతృత్వం కలిగిన ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి దారి చూపుతాయన్నారు. క్రీస్తు మరణం తరువాత అందరికీ స్ఫూర్తి కలిగిస్తున్నారన్నారు. యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగ రోజును ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ మాట్లాడుతూ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్ పండుగ అని, ఈ పండుగను క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారన్నారు.
జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ దేశంలో విభిన్న కులాలు, మతాలు కలిసికట్టుగా చేసే పండుగ క్రిస్మస్ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సీఎం కి బడుగు బలహీన వర్గాలంటే ఎంతో ఇష్టమని, క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం పట్ల సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లో క్రిస్టియన్ల అభివృద్ధికి ఏవైనా అవసరం ఉంటే సహాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా క్యాండిల్ రన్ చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, తదితరులు క్రిస్మస్ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మహబూబ్ వలీ, పాస్టర్లు మల్లెల రమేష్, ఫిలిప్, చెన్నారెడ్డి, గోపాల్ రెడ్డి, డేవిడ్, క్రిస్టియన్ లు పాల్గొన్నారు.