అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మిట్టమీద పల్లె గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ నాయుడు సోమవారం పొలంలో మోటర్ వేస్తుండ గా విద్యుత్ షాక్ తో మృతి చెందడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి మంగళవారం రైతు వెంకటరమణ నాయుడు మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వెంటనే శవ పరీక్ష చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించాలని డాక్టర్లకు సూచించిన ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు, డాక్టర్ జానీ, రాజంపేట ఏరియా హాస్పిటల్ డైరెక్టర్లు వడ్డే శీను, జాకీర్, తదితరులు పాల్గొన్నారు.