విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచిత ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. బాపట్ల జిల్లాలోని యడ్లపల్లిలో ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ చేయనున్నారు. బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో ఉన్న రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్ లను అందించనున్నారు. ఈ ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం వారం రోజులపాటు కొనసాగనుంది.